16/01/2017
ఎన్‌టీపీసీలో ఎగ్జిక్యూటివ్ ట్రెయినీలు...
-ఇంజినీరింగ్ అభ్యర్థులకు అవకాశం
-ఉద్యోగ భద్రత, మంచి జీత భత్యాలు
-గేట్ స్కోర్-2017 ద్వారా ఎంపిక
-చివరి తేదీ: జనవరి 31
నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఎన్‌టీపీసీ) ఎలక్ట్రికల్, మెకానికల్, సివిల్,
ఎలక్ట్రానిక్స్, ఇన్‌స్ట్రుమెంటేషన్ విభాగాల్లో ఖాళీగా ఉన్న ఇంజినీరింగ్ ఎగ్జిక్యూటివ్ ట్రెయినీల భర్తీకి
(గేట్ 2017 స్కోర్ ద్వారా) అర్హులైన ఇంజినీరింగ్ అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.
వివరాలు:
ఎన్‌టీపీసీ విద్యుత్ ఉత్పత్తి, పంపిణీ , సహజ వాయువు అన్వేషణ, ఉత్పత్తి, రవాణా, పంపిణీ చేస్తుంది. దేశ వ్యాప్తంగా 45 ఎన్‌టీపీసీ స్టేషన్లను కలిగి ఉన్నది.
-ఇంజినీరింగ్ ఎగ్జిక్యూటివ్ ట్రెయినీ
-పనిచేసే ప్రదేశం: దేశ వ్యాప్తంగా
-మొత్తం ఖాళీలు: 120 పోస్టులు
-ఎగ్జిక్యూటివ్ ట్రెయినీ విభాగాల వారీగా:
-ఎలక్ట్రికల్-40 పోస్టులు (జనరల్-23, ఓబీసీ-4, ఎస్సీ-10, ఎస్టీ-3)
అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి 65 శాతం మార్కులతో ఏఎంఐఈ/ఇంజినీరింగ్ డిగ్రీ (ఎలక్ట్రికల్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్, ఇన్‌స్ట్రుమెంటేషన్ అండ్ కంట్రోల్ , పవర్ సిస్టమ్ అండ్ హై వోల్టేజ్, పవర్ ఎలక్ట్రానిక్స్, పవర్ ఇంజినీరింగ్)లో ఉత్తీర్ణత.
మెకానికల్-50 పోస్టులు (జనరల్-32, ఓబీసీ-9, ఎస్సీ-6, ఎస్టీ-3)
అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి 65 శాతం మార్కులతో ఏఎంఐఈ/ఇంజినీరింగ్ డిగ్రీ (మెకానికల్, ప్రొడక్షన్, ఇండస్ట్రియల్ ఇంజినీరింగ్, ప్రొడక్షన్ అండ్ ఇండస్ట్రియల్ ఇంజినీరింగ్, థర్మల్, మెకానికల్ అండ్ ఆటోమెషన్, పవర్ ఇంజినీరింగ్) లో ఉత్తీర్ణత.
సివిల్-10 పోస్టులు (జనరల్-4, ఓబీసీ-3, ఎస్సీ-2, ఎస్టీ-1)
అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి 65 శాతం మార్కులతో ఏఎంఐఈ/ఇంజినీరింగ్ డిగ్రీ ( సివిల్, కన్‌స్ట్రక్షన్ )లో ఉత్తీర్ణత.
-ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్‌స్ట్రుమెంటేషన్-20 పోస్టులు (జనరల్-17, ఓబీసీ-1, ఎస్సీ-1, ఎస్టీ-1)
అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి 65 శాతం మార్కులతో ఏఎంఐఈ/ఇంజినీరింగ్ డిగ్రీ (ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రానిక్స్ అండ్ టెలీ కమ్యూనికేషన్, ఎలక్ట్రానిక్స్ అండ్ పవర్, పవర్ ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రానిక్స్ ఇన్‌స్ట్రుమెంటేషన్ అండ్ కంట్రోల్)లో ఉత్తీర్ణత.
-పే స్కేల్ : రూ. 24,900-3%-50,500/-ఇతర అలవెన్స్‌లు ఉంటాయి.
-వయస్సు: 2017 జనవరి 1 నాటికి 27 ఏండ్లకు మించరాదు. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదేండ్లు, ఓబీసీ అభ్యర్థులకు మూడేండ్లు, పీహెచ్‌సీ అభ్యర్థులకు పదేండ్ల వరకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
ఎంపిక: గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజినీరింగ్ (గేట్) 2017 స్కోర్ ఆధారంగా.. గేట్ స్కోర్ ఆధారంగా మెరిట్ ప్రకారం షార్ట్‌లిస్ట్ పొందిన అభ్యర్థులకు గ్రూప్ డిస్కషన్, పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు.
-అప్లికేషన ఫీజు: రూ.150/-, ఎస్సీ, ఎస్టీ, పీహెచ్‌సీ, ఎక్స్‌సర్వీస్‌మెన్ అభ్యర్థులకు ఫీజు లేదు.
-ప్రొబేషన్ పీరియడ్: ఏడాదిపాటు ఉంటుంది. ఈ ట్రెయినింగ్ పీరియడ్‌లో చూపిన పర్‌ఫార్మెన్స్ ఆధారంగా దేశంలో ఎక్కడైనా పోస్టింగ్ ఇస్తారు.
-దరఖాస్తు: ఆన్‌లైన్ ద్వారా.
-దరఖాస్తులను పంపించడానికి చివరితేదీ : 2017, జనవరి 31
వెబ్‌సైట్: www.ntpccareers.net