Telugu Vantalu

Telugu Vantalu Welcome to the world your Favorite food recipes..!!

పాలక్ ఫ్రైడ్ రైస్ ::కావలసినవి: బాస్మతి బియ్యం - 250 గ్రా./ ఒక గ్లాస్, పాలక్ ప్యూరీ (పాలకూరను ఉడికించి చల్లారిన తర్వాత గ్...
18/06/2022

పాలక్ ఫ్రైడ్ రైస్ ::

కావలసినవి:
బాస్మతి బియ్యం - 250 గ్రా./ ఒక గ్లాస్,
పాలక్ ప్యూరీ (పాలకూరను ఉడికించి చల్లారిన తర్వాత గ్రైండ్ చేసుకోవాలి) - 1 కప్పు,
ఉల్లిపాయ - 1 (నిలువు ముక్కలుగా కట్ చేసుకోవాలి),
క్యారెట్ - 1 (ముక్కలుగా కట్ చేసుకోవాలి),
పచ్చి బఠానీ గింజలు - అర కప్పు,
పచ్చి మిర్చి - 3 (కట్ చేసుకోవాలి, మిరియాల పొడి - అర టీ స్పూన్, సోయాసాస్ - అర టేబుల్‌స్పూన్,
ఉప్పు - రుచికి తగినంత,
నూనె - 2 టీ స్పూన్లు

తయారి:
1. గిన్నెలో నూనె వేడయ్యాక ఉల్లిపాయలు, క్యారట్, పచ్చిమిర్చి, బఠానీలు... ఒకదాని తర్వాత ఒకటి వేసి వేగనివ్వాలి.
2. తర్వాత పాలక్ ప్యూరీ, ఉప్పు, మిరియాలపొడి, సోయాసాస్ వేసి కొన్ని నిమిషాలు ఉడికించి, ఒకటిన్నర గ్లాసుల నీళ్లు పోసి మరగనివ్వాలి.
3. త ర్వాత బియ్యం పోసి ఉడకనివ్వాలి. అన్నం పూర్తయ్యాక దించి రైతాతో వేడి వేడిగా వడ్డించాలి. (అన్నం విడిగా వండి, నీళ్లు పోయకుండా ఉడికిన పాలక్ ప్యూరీ మిశ్రమంలో వేసి, కలిపి కూడా పాలక్ ఫ్రైడ్ రైస్‌ను తయారుచేసుకోవచ్చు)

గుమ్మడి - శనగల కుర్మా ::కావలసినవి:పెద్ద శనగలు - చిన్నకప్పు, మీల మేకర్ - కప్పుదాల్చినచెక్క, లవంగాలు, గసగసాలు - రెండు టీ స...
11/02/2022

గుమ్మడి - శనగల కుర్మా ::

కావలసినవి:
పెద్ద శనగలు - చిన్నకప్పు,
మీల మేకర్ - కప్పు
దాల్చినచెక్క, లవంగాలు, గసగసాలు - రెండు టీ స్పూన్లు
పచ్చికొబ్బరి తురుము - మూడు స్పూన్లు,
నూనె - 5 టీ స్పూన్లు
పోపు దినుసులు - రెండు టీ స్పూన్లు
పసుపు - చిటికెడు,
టొమాటో ప్యూరీ - అర కప్పు
గుమ్మడిముక్కలు - కప్పు,
ఉప్పు - తగినంత
కారం - తగినంత,
గరం మసాలా - రెండు టీ స్పూన్లు
పల్లీ, నువ్వులపొడి - మూడు టీ స్పూన్లు
పచ్చిమిర్చి తరుగు - రెండు టీ స్పూన్లు
కొత్తిమీర, మెంతి తరుగు - 4 టీ స్పూన్లు

తయారి:
1.ముందుగా పెద్దశనగలు ఉడికించి పక్కనుంచాలి. మీల్మేకర్లో వేడి నీరుపోసి పక్కనుంచాలి.
2. దాల్చినచెక్క, లవంగాలు, గసగసాలు, పచ్చికొబ్బరి తురుము (సగం మాత్రమే) వీటన్నిటినీ మిక్సీలో వేసి పేస్ట్‌లా చేయాలి.
3. స్టౌ మీద బాణలిలో నూనె కాగాక పోపు దినుసులు వేసి వేయించాలి.
4. తరవాత అందులో పసుపు, ఉల్లిపాయ పేస్ట్, టొమాటో ప్యూరీ వేసి పచ్చివాసన పోయేదాకా వేయించాక, గుమ్మడికాయ ముక్కలు, ఉడికించిన శనగలు, వేడినీటి నుంచి తీసిన మీల్మేకర్‌లను ఇందులో వేసి మూత పెట్టి మగ్గనివ్వాలి.
5. బాగాఉడికినతరవాత ఉప్పు, కారం, గరం మసాలా, పల్లీపొడి, నువ్వులపొడి, పచ్చిమిర్చి తరుగు వేసి మరి కాస్త మగ్గినతరువాత ముందుగా తయారుచేసుకున్న కొబ్బరిపేస్ట్, కొద్దిగా నీరు పోసి మూత పెట్టాలి.
6. కూర గ్రేవాలా తయారైన తరవాత మూత తీసి మిగిలిన కొబ్బరి తురుము కూడా వేసి కాసేపు ఉంచి స్టవ్ మీద నుంచి దించి కొత్తిమీర, మెంతికూరలతో గార్నిష్ చేయాలి.

గుమ్మడి ఇగురు::కావలసినవి:నూనె -నాలుగు టీ స్పూన్లుఆవాలు - టీ స్పూను, జీలకర్ర - టీ స్పూనుమినప్పప్పు-టీ స్పూను, శనగపప్పు-టీ...
07/02/2022

గుమ్మడి ఇగురు::

కావలసినవి:
నూనె -నాలుగు టీ స్పూన్లు
ఆవాలు - టీ స్పూను,
జీలకర్ర - టీ స్పూను
మినప్పప్పు-టీ స్పూను,
శనగపప్పు-టీ స్పూను
ఎండుమిర్చి - 6,
పసుపు - చిటికెడు
గుమ్మడిముక్కలు - కప్పు
ఇంగువ - చిటికెడు
ఉప్పు - తగినంత,
కారం - తగినంత
చింతపండు గుజ్జు - రెండు టీ స్పూన్లు
బెల్లం - రుచికి కొద్దిగా

తయారి:
1. స్టౌ మీద బాణలిలో నూనె వేడయ్యాక ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, శనగపప్పు, ఎండుమిర్చి వేసి వేగనివ్వాలి.
2. తరవాత గుమ్మడిముక్కలు, ఇంగువ, పసుపు వేసి అన్నిటినీ బాగా కలిపి మూతపెట్టి రెండు నిముషాలు మగ్గిన తరవాత ఉప్పు, కారం వేసి ముక్కలు మెత్తపడే వరకు కలుపుతూ ఉడికించుకోవాలి.
3. తరవాత మూత తీసి, చింతపండు గుజ్జు, బెల్లం, కరివేపాకు వేసి మరికాసేపు ఉడికించి దించేయాలి.

సజ్జ బూరెలు ::కావలసిన పదార్థాలు :సజ్జలు-ఒక కిలో, బెల్లం-అర కిలో, యాలకులు-4, నూనె-తగినంత. తయారుచేసే విధానం : 1. సజ్జలను బ...
09/01/2022

సజ్జ బూరెలు ::

కావలసిన పదార్థాలు :
సజ్జలు-ఒక కిలో,
బెల్లం-అర కిలో,
యాలకులు-4,
నూనె-తగినంత.

తయారుచేసే విధానం :
1. సజ్జలను బాగు చేసుకుని, కడిగి, ఆరబోసి, బాగా ఎండాక పిండి పట్టించుకుని ఉంచుకోవాలి.
2. ఒక గిన్నెలో పావులీటరు నీళ్లు పోసి, అందులో తరిగిన బెల్లంను వేసి స్టవ్‌పై మీద పెట్టాలి.
3. బెల్లం పూర్తిగా కరిగాక దించి అందులో యాలకుల పొడి, సజ్జపిండి వేసి బాగా కలపాలి.
4. అవసరమైతే మరికొన్ని వేడినీళ్లు పోసి బూరె వచ్చేలా పిండిని కలుపుకోవాలి.
5. తర్వాత పెద్ద కడాయిలో నూనె పోసి స్టవ్‌పై ఉంచి, నూనె వేడెక్కాక సజ్జ పిండి కొద్ది కొద్దిగా తీసుకుని అర చేతిలోనే బూరెలా వత్తుకుంటూ నూనెలో వేసి ఎర్రగా వచ్చే వరకు కాల్చాలి.

కజ్జికాయలు::కావలసిన వస్తువులు:మైదా- 500గ్రా., నెయ్యి- 100గ్రా., ఉప్పు-చిటికెడు, చక్కెర-350గ్రా., కొబ్బరికాయలు-2, గసగసాలు...
08/01/2022

కజ్జికాయలు::
కావలసిన వస్తువులు:
మైదా- 500గ్రా.,
నెయ్యి- 100గ్రా.,
ఉప్పు-చిటికెడు,
చక్కెర-350గ్రా.,
కొబ్బరికాయలు-2,
గసగసాలు-100గ్రా.,
పుట్నాల పప్పు- 150గ్రా.,
యాలకులు-5గ్రా.,
ఆయిల్‌-తగినంత

తయారు చేసే విధానం:
1. మైదావిండిని జల్లించి దీనికి ఉప్పు, నెయ్యి కలివి నీళ్ళతో పూరీల విండిలా కలపండి.
2. ఒక బాణలిలో తురిమిన కొబ్బరికోరు వేసి సన్నని మంటమీద వేయిం చిన తర్వాత అందులో పుట్నాల పప్పుపొడి, గసాలు, చక్కెర కూడా వేసి బాగా వేయించి స్టౌ మీది నుంచి దింపి, యాలకుల పొడి కలివి పక్కన ఉంచండి.
3. ముందుగా కలివి సిద్ధం చేసు కున్న మైదాను చిన్న, చిన్న ముద్దలుగా చేసుకొని వాటిని పూ రీల్లా వత్తి, దాని మధ్యలో బాణలి లో తయారు చేసిన కొబ్బరి తురుము, పుట్నాల పప్పు విండి మిశ్ర మాన్ని రెండు స్పూనులు వేసి పూరీని మధ్యకు మడవండి. అర్ధ చంద్రాకారంలో వస్తుంది.
4. తర్వా త వాటి చివరలను తడి చేసి మడత మీద మడత వేసి వేళ్లతో గట్టిగా అదమండి.
5. ఈ విధంగా చేయడం వల్ల మడత లోపలి మిశ్రమం బయటకు రాదు. ఇలా తయారయిన కజ్జికాయ లను కాగిన నూనెలో ఎర్రగా వేయించండి.

క్యాలీఫ్లవర్ పికిల్ ::కావలసినవి:క్యాలీఫ్లవర్ - ఒకటి (మీడియం సైజు)పచ్చిమిర్చి - మూడు (సన్నగా తరగాలి), నూనె - 200 గ్రామిరప...
06/01/2022

క్యాలీఫ్లవర్ పికిల్ ::

కావలసినవి:
క్యాలీఫ్లవర్ - ఒకటి (మీడియం సైజు)
పచ్చిమిర్చి - మూడు (సన్నగా తరగాలి),
నూనె - 200 గ్రా
మిరప్పొడి - 150 గ్రా,
పసుపు - చిటికెడు,
ఆవపిండి - టీ స్పూన్
ఆవ నూనె- టీ స్పూన్,
ధనియాల పొడి - టీ స్పూన్
నిమ్మ ఉప్పు - టీ స్పూన్,
ఎండుమిర్చి - ఐదు,
వెల్లుల్లి - ఐదురేకలు
కరివేపాకు - ఒక రెమ్మ,
ఉప్పు - తగినంత,
జీలకర్ర - చిటికెడు
ఆవాలు- చిటికెడు,
జీలకర్ర పొడి - అర టీ స్పూన్
మెంతిపొడి - అర టీ స్పూన్

తయారి:
1. క్యాలీఫ్లవర్‌ను విడదీసి ఉప్పు కలిపిన వేడి నీటిలో ఐదు నిమిషాల సేపు ఉంచి తీయాలి.
2. తర్వాత నీరు పోయేటట్లు ఆరనివ్వాలి. ఇలా చేయడం వల్ల పువ్వులోపల ఉన్న దుమ్ము వదిలి శుభ్రమవుతుంది.
3. ఇప్పుడు బాణలిలో 50గ్రాముల నూనె పోసి అందులో క్యాలీఫ్లవర్, పచ్చిమిర్చి ముక్కలను వేసి రెండు నిమిషాల పాటు వేయించాలి.
4. వేయించిన ముక్కలను వెడల్పుగా ఉన్న గిన్నెలో వేసి అందులో మిరప్పొడి, పసుపు, ఆవపిండి, ఆవనూనె, ధనియాల పొడి, ఉప్పు, నిమ్మ ఉప్పు, జీలకర్ర పొడి, మెంతిపిండి వేసి బాగా కలపాలి.

పోపు:
బాణలిలో 150 గ్రాముల నూనె వేసి అందులో వెల్లుల్లి రేకలు, జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు వేసి వేగిన తర్వాత దించాలి. నూనె చల్లారిన తర్వాత క్యాలీఫ్లవర్ ముక్కల్లో వేసి కలిపితే క్యాలీఫ్లవర్ పికిల్ రెడీ.

కోకోనట్ ప్రాన్స్ కర్రీ ::కావలసిన పదార్థాలు:ప్రాన్స్ - అరకేజీ, టమాట(తరిగినవి) - ఒక కప్పు, ఉల్లిపాయలు(తరిగినవి) - అరకప్పు,...
26/12/2021

కోకోనట్ ప్రాన్స్ కర్రీ ::

కావలసిన పదార్థాలు:
ప్రాన్స్ - అరకేజీ,
టమాట(తరిగినవి) - ఒక కప్పు,
ఉల్లిపాయలు(తరిగినవి) - అరకప్పు,
మిరపకాయలు - రెండు,
అల్లంవెల్లుల్లి పేస్టు - ఒక స్పూన్,
దాల్చినచెక్క, లవంగాలు, యాలకులు(అన్నీ కలిపి పొడి చేసుకోవాలి)- ఒక స్పూన్,
ధనియాల పొడి - ఒక స్పూన్,
మిరియాల పొడి - చిటికెడు,
కొత్తిమీర, కరివేపాకు - సరిపడా,
మిరపపొడి - ఒక స్పూన్,
నూనె - సరిపడా,
ఉప్పు - తగినంత,
కొబ్బరి పాలు - ఒక కప్పు,
జీడిపప్పు పేస్టు - రెండు స్పూన్‌లు,
పసుపు - చిటికెడు.

తయారుచేయు విధానం:
1. ముందుగా ప్రాన్స్‌ని శుభ్రం చేసుకోవాలి. తరువాత ఒక పాత్రలో నూనె పోసి ఉల్లిపాయలు, మిర్చి, కరివేపాకు వేసి వేయించుకోవాలి.
2. కాసేపయ్యాక టమాట ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్టు వేసి వేయించుకోవాలి.
3. తరువాత జీడిపప్పు పేస్టు, ప్రాన్స్ వేసి బాగా కలుపుకోవాలి. ఉప్పు, మిరపపొడి, ధనియాల పొడి, దాల్చిన చెక్క, లవంగాల పొడి, పసుపు, కొత్తిమీర, మిరియాలపొడి వేసి పదినిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి.
4. ఇప్పుడు కొబ్బరిపాలు పోసి పది నిమిషాలు ఉడికించుకోవాలి. చివరగా మిగిలిన కొత్తిమీర, ఉల్లిపాయలతో గార్నిష్ చేసుకోవాలి.

పొంగల్ ::కావలసిన పదార్థాలు: పెసరపప్పు -1 కప్పు, బియ్యం - 2 కప్పులు, మిరియాలు - అర టేబుల్ స్పూను, నెయ్యి + నూనె - 1 టేబుల...
14/12/2021

పొంగల్ ::

కావలసిన పదార్థాలు:
పెసరపప్పు -1 కప్పు,
బియ్యం - 2 కప్పులు,
మిరియాలు - అర టేబుల్ స్పూను,
నెయ్యి + నూనె - 1 టేబుల్ స్పూను,
జీలకర్ర - 1 టీ స్పూను,
కరివేపాకు - 4 రెబ్బలు,
ఉప్పు - రుచికి తగినంత

తయారుచేసే విధానం:
1. పెసరపప్పు, బియ్యం రెండూ కలిపి కొద్దిసేపు నానబెట్టాలి.
2. సగం మిరియాలను కచ్చాపచ్చాగా దంచుకోవాలి (పగిలిన మిరియాల ఘాటు పొంగల్‌కు పడుతుంది).
3. తర్వాత కడాయిలో నూనె+నెయ్యి వేసి మిరియాలు, జీలకర్ర, కరివేపాకు వేగించి, అందులోనే నీరు వడకట్టిన పెసరపప్పు, బియ్యం వేసి సన్నని సెగమీద కొద్దిసేపు మూత పెట్టి ఉంచాలి.
4. తర్వాత 8 కప్పుల నీరుపోసి, తగినంత ఉప్పువేసి ఉడికించాలి.
5. ఈ పొంగల్‌ని సాంబార్తో, లేదా పల్లీల పచ్చడితో తింటే చాలా రుచిగా ఉంటుంది.

నాటు కోడి షోరువా::కావలసినవి:చికెన్ - 750 గ్రా., మిరప్పొడి - మూడు టీస్పూన్లు (కారంగా ఇష్టపడేవాళ్లు మరింత వేసుకోవచ్చు), పస...
09/12/2021

నాటు కోడి షోరువా::

కావలసినవి:
చికెన్ - 750 గ్రా.,
మిరప్పొడి - మూడు టీస్పూన్లు (కారంగా ఇష్టపడేవాళ్లు మరింత వేసుకోవచ్చు),
పసుపు - ఒక టీ స్పూను,
అల్లం వెల్లుల్లి పేస్టు - ఒక్కొక్కటి మూడు టేబుల్ స్పూన్ల చొప్పున (కడిగిన చికెన్ ముక్కలకు అల్లం వెల్లుల్లి పేస్టు, పసుపు, మిరప్పొడి పట్టించి పక్కన ఉంచాలి),
నూనె - నాలుగు టేబుల్ స్పూన్లు,
కరివేపాకు - రెండు రె మ్మలు,
సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు - 100 గ్రా,
కాశ్మీరీ మిరప్పొడి - రెండు టీ స్పూన్లు,
మసాలా పౌడర్ - 4 స్పూన్లు,
ఉప్పు - తగినంత ,
కొత్తిమీర - గుప్పెడు (సన్నగా తరగాలి)

తయారి:
1. నాన్‌స్టిక్ పాన్‌లో నూనె వేడి చేసి కరివేపాకు, ఉల్లిపాయలు వేసి వేయించాలి.
2. ఉల్లిపాయలు ఎరగ్రా వేగిన తరవాత అల్లంవెల్లుల్లి పేస్టు, పసుపు, మిరప్పొడి పట్టించి ఉంచిన చికెన్ మిశ్రమాన్ని వేసి సన్నమంట మీద వేగనివ్వాలి.
3. ముక్కల్లో ఎరుపుదనం పోయి నీరు వెలువడడం మొదలయ్యాక మసాలా పౌడర్, కాశ్మీరీ చిల్లీ పౌడర్ కలిపి కొద్ది సేపు మగ్గనివ్వాలి.
4. ఇప్పుడు ఒకటిన్నర కప్పు నీటిని పోసి పది నిమిషాల సేపు సన్నమంట మీద ఉడికించాలి.
5. మధ్యలో మూడు నిమిషాలకొకసారి కలిపి మూత పెడుతుండాలి. ఉప్పు, కొత్తిమీర వేసి సమంగా పట్టేటట్లు కలిపి దించాలి. ఇది అన్నం, గారెలలోకి బాగుంటుంది.

సమోసా::కావలసినవి:గోధుమపిండి - పావుకిలో, ఉప్పు - చిటికెడు, ఉల్లితరుగు - కప్పు, ఉల్లిపరక తరుగు - పావు కప్పు, పచ్చిమిర్చి -...
18/11/2021

సమోసా::

కావలసినవి:
గోధుమపిండి - పావుకిలో,
ఉప్పు - చిటికెడు,
ఉల్లితరుగు - కప్పు,
ఉల్లిపరక తరుగు - పావు కప్పు,
పచ్చిమిర్చి - 5,
క్యాబేజీ, క్యారట్ తురుము - పావుకప్పు,
పసుపు - చిటికెడు,
ఉప్పు - తగినంత,
కొత్తిమీర - కొద్దిగా,
నూనె - తగినంత

తయారి:
1. గోధుమపిండిలో ఉప్పు వేసి, నీటితో చపాతీ పిండిలా కలుపుకోవాలి. 2. ప్యాన్‌లో నూనె వేడిచేసి ఉల్లితరుగు, ఉల్లిపరక, పచ్చిమిర్చి వేసి మెత్తబడేవరకు వేయించాలి.
3. తరవాత తరిగిన క్యాబేజీ, క్యారట్, తగినంత ఉప్పు, పసుపు వేసి బాగా కలియబెట్టి మూతపెట్టాలి.
4. ఐదు నిమిషాల తరవాత తడి పోయాక కొత్తిమీర వేసి దింపేయాలి. పిండి బాగా మెత్తగా అయ్యాక చిన్న ఉండలుగా చేసుకుని పలుచగా చపాతీ సైజులో ఒత్తుకోవాలి.
5. పెనం వేడి చేసి ఈ చపాతీని రెండువైపులా కొద్దిగా వెచ్చబెట్టి తీసి పక్కన పెట్టుకోవాలి. చల్లారిన తరవాత చపాతీలను రెండు అంగుళాల వెడల్పులో నిలువుగా రిబ్బనులా కట్ చేసుకోవాలి.
6. ఒక కొనవైపు కొద్దిగా ఉల్లిపాయ మిశ్రమాన్ని పెట్టి త్రికోణంలా మడుస్తూ పోవాలి.
7. మొత్తం సమోసాని త్రికోణంలా మడిచాక అంచులు తడిచేసి విడిపోకుండా ఒత్తి మూసేయాలి. వేడినూనెలో వేసి కరకరలాడేలా వేయించాలి.

చేపలూ రొయ్యలూ ... ' సముద్ర పంట ' .... రుచిచేపలూ రొయ్యలూ లేకపోతే సముద్రానికి మనం అంతగా విలువివ్వనక్కర్లేదు.చేపలూ రొయ్యలూ ...
14/11/2021

చేపలూ రొయ్యలూ ... ' సముద్ర పంట ' .... రుచి

చేపలూ రొయ్యలూ లేకపోతే సముద్రానికి మనం అంతగా విలువివ్వనక్కర్లేదు.
చేపలూ రొయ్యలూ సముద్ర పంట.
తనకు తనే పండించి మన వలలకు సిద్ధం చేసే పంట.
తాజా చేపలు దొరికిన వాళ్లు అదృష్టవంతులు. వాటిని రోజూలా కాకుండా కొత్తగా వండటం నేర్చినవాళ్లు భాగ్యమంతులు. ఫిష్‌ను టిక్కా చేసినా ప్రాన్స్‌ను హక్కా చేసినా తుదకు నాలుక మీద చేరే వేళకు యమ్మీ అనిపించాలి.
నిలువెల్లా రుచి కమ్మేయాలి.
సండే ఒక కిలో చేపలు కొనండి.
పోనీ అరకిలో రొయ్యలైనా సరే.
ఉప్పూ... కారం... కాసింత మసాలా... రెండు ముద్దల దూరంలో స్వర్గం. ఎంజాయ్.

తినరా చేదు మరిచి... కాకరకాయకాకర ఉల్లికూర :కావలిసిన పదర్థాలు: కాకరకాయలు - నాలుగు, ఉల్లిపాయలు - మూడు, కారం - రెండు టీ స్పూ...
10/11/2021

తినరా చేదు మరిచి... కాకరకాయ

కాకర ఉల్లికూర :
కావలిసిన పదర్థాలు:
కాకరకాయలు - నాలుగు,
ఉల్లిపాయలు - మూడు,
కారం - రెండు టీ స్పూన్లు,
పసుపు - చిటికెడు,
ఉప్పు - తగినంత,
పంచదార - రెండు టీ స్పూన్లు,
నూనె - రెండు కప్పులు.

తయారుచేయు విధానం:
1. కాకరకాయల్ని చిన్న ముక్కలుగా చేసుకుని రోట్లో వేసి దంచుకోవాలి.
2. దంచేటపుడే తగినంత ఉప్పుకూడా వేసుకోవాలి.
3. బాగా దంచాక రోట్లో నుంచి తీసి గట్టిగా పిండాలి.
4. తర్వాత ఉల్లిపాయల్ని చిన్న ముక్కలుగా కోసి రోట్లో వేసి దంచాలి. 5. ముక్కలు కొద్దిగా నలిగాక కాకరకాయ ముద్దను కూడా వేసి రెండూ బాగా కలిసేలా దంచుకోవాలి.
6. పసుపు, కారం కూడా వేసి బాగా కలపాలి.
7. ఇప్పుడు స్టౌ మీద మందపాటి గిన్నె పెట్టి నూనెపోసి వేడెక్కాక దంచిపెట్టుకున్న ముద్దను వేసి ఎరుపురంగు వచ్చేవరకూ వేగించుకోవాలి.
8. దించేముందు పంచదార వేసి కలిపితే రుచిగా ఉంటుంది.(Optional)

Address

Hyderabad

Alerts

Be the first to know and let us send you an email when Telugu Vantalu posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share